మోహన్ బాబు యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రగిరి మండలం రంగంపేట హాస్టల్లో ఘటన

 మోహన్ బాబు యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రగిరి మండలం రంగంపేట హాస్టల్లో ఘటన

తిరుపతి జిల్లా చంద్రగిరి  మండలం  రంగంపేట ఓ ప్రైవేట్ హాస్టల్లో ఎం బి యు ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో  కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నభువవ (22)గా గుర్తించారు.  మృతురాలు పుంగనూరు నియోజకవర్గం లోని మంగళం కు చెందిన విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. 

సమాచారం అందుకున్న   చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు  ఇంకా తెలియాల్సి ఉందని  చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

మోహనబాబు యూనివర్శిటీలో ఎంబీయూ చదువుతూ ఆత్మహత్య చేసుకున్న భువన తండ్రి స్పందించారు.  తన కుమార్తె ఎందుకు ఇలా చేసిందో తెలియని.. రూ. 17 లక్షల ప్యాకేజ్​ తో ఉద్యోగం వచ్చిందని .. తమ కష్టాలు తీరుతాయని అనే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. నాకు ఇద్దరు కుమార్తెలున్నారని  మొదటి కుమార్తె భువన కాగా .. రెండో అమ్మాయి హర్షిత అదే కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.